కలవపూడి అగ్రహారం వార్డు సచివాలయానికి బదిలీ చేయించాలని వినతి

గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశించారు.

Update: 2019-11-27 11:09 GMT
మంత్రి కొడాలి నాని, సర్వేయర్ జి అనురూప్ మరియు శ్యాంబాబు

గుడివాడ: గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. బుధవారం స్థానిక రాజేంద్రనగర్లోని ఇంట్లో మంత్రి కొడాలి నానిని ముదినేపల్లి మండలం దేవపూడి సచివాలయంలో సర్వేయర్గా చేరిన జి అనురూప్, అతని తండ్రి శ్యాంబాబు కలిసారు.

అనురూప్ ను గుడివాడ రూరల్ మండలం కలవపూడి అగ్రహారం సచివాలయానికి బదిలీ చేయించాలని అనురూప్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇకపై సచివాలయాల ద్వారానే ప్రజలకు సక్రమంగా అందుతాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు అందరూ పని చేయాలని అన్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు అందరూ పని చేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు.



Tags:    

Similar News