KRMB ఛైర్మన్‌ను కలిసిన రాయలసీమ స్టీరింగ్ కమిటీ
Byreddy Rajasekhar Reddy: జగన్‌కు వైజాగ్ దెయ్యం పట్టుకుంది
KRMB ఛైర్మన్‌ను కలిసిన రాయలసీమ స్టీరింగ్ కమిటీ
Byreddy Rajasekhar Reddy: బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలోని రాయలసీమ స్టీరింగ్ కమిటీ KRMB చైర్మన్ ను కలిసింది. KRMB కార్యాలయాన్ని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రం ఇచ్చారు. KRMB కార్యాలయాన్ని కర్నూలులో పెడితే అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఆయన కృష్ణా నదికి వైజాగ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇది రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టడం వల్ల రెండు రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. జగన్‌కు వైజాగ్ దెయ్యం పట్టుకుందన్న బైరెడ్డి ఈనెల 28న ఛలో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం చేపడతామన్నారు.