Andhra Pradesh: ఏపీ హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట
Ration Dealers: ఏపీ హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది ఏపీ హైకోర్టు.
Andhra Pradesh: ఏపీ హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట
Ration Dealers: ఏపీ హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది ఏపీ హైకోర్టు. దశాబ్ధాలుగా కమిషన్‌తో పాటు గోనె సంచుల ద్వారా ఆదాయం పొందుతున్న రేషన్ డీలర్లకు తాజాగా డబ్బులు ఇచ్చేది లేదని అధికారులు ఆదేశించారు. దీంతో రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. డీలర్ల తరపున హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.