Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

Tirumala: శ్రీవారి భక్తులకు కన్నుల పండుగ

Update: 2023-01-28 03:37 GMT

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

Tirumala: తెలుగు సంవత్సరంలో పదకొండో నెల మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం విశిష్టమైనది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావించి హిందువులు అత్యంత ఘనంగా జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యభగవానుడు పూజలను అందుకుంటున్న అరసవెల్లి సహా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను రథసప్తమి వేడుకలకు రెడీ చేశారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.

తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మలయప్ప స్వామి తిరుమల ఏడు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగుతోంది. మినీ బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సూర్యభగవానుడి జయంతి రోజు కావడంతో తిరుమలలో ప్రత్యేక సేవ లు నిర్వహిస్తున్నారు. సూర్యజ యంతిని అంగ రంగ వైభ వంగా నిర్వహిస్తుండ టంతో తిరుమ ల కు భ క్తులు పెద్ద సంఖ్యలో త ర లివ చ్చారు. తిరుమ ల మాడ వీధులు భక్తుల తో కిట కిట లాడుతున్నాయి.

తిరుమ‌లలో బ్రహ్మోత్సవాల త‌ర‌హాలో మినీ బ్రహ్మోత్సవాలుగా ర‌థ‌స‌ప్తమి వేడుక‌ల‌ను నిర్వహిస్తున్నారు. ఇక తిరుమ‌ల‌తో పాటు, దేశంలోని ప్రముఖ దేవాల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భ‌క్తులు పెద్ద సంఖ్యలో ఆల‌యాల‌కు చేరుకున్నారు. ఆల‌యాల్లో ప్రత్యేక పూజ‌లు నిర్వహిస్తున్నారు. సూర్యభ‌గ‌వానుడికి దీపాలు వెలిగించి భ‌క్తిని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సూర్యదేవాయాల‌కు భ‌క్తులు పోటెత్తారు. అస‌ర‌వెల్లిలో భ‌క్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అర‌స‌వెల్లి సూర్యనారాయ‌ణుడి ద‌ర్శనానికి రెండు గంట‌లకు పైగా స‌మ‌యం ప‌డుతోంద‌ని అధికారులు చెబుతున్నారు.

ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో శ్రీవారు విహరించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై విహరిస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీవారు విహరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీవారు విహరిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు విహరిస్తారు.

Tags:    

Similar News