representational image
Ramatheertham Incident: రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడంతో ఇవాళ మరోసారి చలో రామతీర్థం చేపడుతున్నట్టు ప్రకటించారు బీజేపీ సీనియర్ నేతలు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ మంత్రులు, ఎంపీలను, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కొండపైకి అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ రామతీర్థం ఆలయాన్ని సందర్శించే తీరుతామని తేల్చిచెప్పారు బీజేపీ నేతలు. మరోవైపు రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. దీంతో రామతీర్థంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.