Raghuveera Reddy: బృహత్తర కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

Raghuveera Reddy: ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు పాత ఆలయాల జీర్ణోద్ధారణకు నడుం బిగించారు మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.

Update: 2021-06-20 05:00 GMT

రఘువీరా రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Raghuveera Reddy: ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు పాత ఆలయాల జీర్ణోద్ధారణకు నడుం బిగించారు మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి. కొత్త ఆలయాలనూ నిర్మిస్తూ ఆ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చి పెట్టారు. పెద్దల ఆశయాలను నెరవేర్చేందుకు గ్రామస్థులతో కలిసి రెండేళ్లుగా ఆయన చేస్తున్న కృషి ఫలించింది. రాజకీయాలకు కొంత కాలంగా స్వస్తి పలికి స్వగ్రామంలో చేపట్టిన మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఆయన. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో తలపెట్టిన ఆలయాల ప్రతిష్టపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం మాజీ మంత్రి రఘువీరా రెడ్డి వందల ఏళ్ల ఆలయాల పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామస్థుల సహకారంతో పురాతన నీలకంఠేశ్వరస్వామి దేవాలయ పునరుద్ధరణతో పాటు కొత్తగా పలు ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. గత రెండేళ్లుగా రాజకీయాలను పక్కన బెట్టి మాజీ మంత్రి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి పూనుకోవడంపై ఆలయ అర్చకులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 19 నుంచి 23 వరకూ గ్రామంలో నెలకొల్పిన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అందుకోసం ఆలయాలను ఇప్పటికే స్సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎక్కువకాలం వదిలేయడం మంచిది కాదని కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రఘువీరా రెడ్డి చెబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పరిమిత సంఖ్యలో పురోహితులు మాత్రమే హాజరై కైంకర్యాలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు.

రఘువీరా రెడ్డి గ్రామస్థులతో కలిసి చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సినీ, రాజకీయ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరవు నేలపై ఇలాంటివి చేపట్టడం పట్ల ఆయనను అభినందిస్తున్నారు. తన సొంత గ్రామంలో వందల సంవత్సరాల నాటి ఆలయాలను పునరుద్ధరించి ఆధ్యాత్మిక చింతను చాటడం గొప్పవిషమే. దేవుడి ఆశీస్సులతో ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం.

Tags:    

Similar News