ఏపీ పోలీసులపై ఫిర్యాదు.. సీఎంపై చర్యలు తీసుకోవాలని వినతి
Raghurama Krishnam Raju: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.
ఏపీ పోలీసులపై ఫిర్యాదు.. సీఎంపై చర్యలు తీసుకోవాలని వినతి
Raghurama Krishnam Raju: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద సీబీసీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతేకాకుండా ఏపీ పోలీసులపై కూడా స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు రఘురామ. ఈ మేరకు రఘురామ ఓ లేఖను ఓం బిర్లాకు అందజేశారు. ఏపీ సీఎం జగన్, డీజీపీ, ఏఎస్పీ విజయ్ పాల్, సీబీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.