Vijayawada: దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం.. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం..
Vijayawada: విజయవాడ దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం
Vijayawada: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయం
Vijayawada: విజయవాడ దుర్గగుడి ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఆలయ ట్రాన్స్‌పోర్ట్ డీఈని ఈవో ఆదేశించినట్లు సమాచారం. అయితే దేవాదాయ కమిషనర్, పాలక మండలితో చర్చించకుండానే ఈవో నిర్ణయం తీసుకోవడంపై పాలక మండలి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. భక్తులకు ఉచిత సేవలు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని మరోవైపు ఈవో చెబుతున్నారు. అయితే ఈవో నిర్ణయం కక్ష సాధింపు అని టెంపుల్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరడం, ఆపై కోర్టుకు వెళ్లడంతోనే ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. దుర్గగుడి ఈవో నిర్ణయంపై దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో టెంపుల్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులు ఉన్నారు.