YSRCP MLA కు నిరసన సెగ.. జగన్ ముద్దు, ఆయనొద్దంటూ నినాదాలు..
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ తగిలింది.
YSRCP MLA కు నిరసన సెగ.. జగన్ ముద్దు, ఆయనొద్దంటూ నినాదాలు..
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. అచ్చుతాపురం మండలం డొప్పెర్లకు వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబును అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. కన్నబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు వద్దు - జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ ప్లకార్డులతో ధర్నా చేశారు. పోలీసులు గ్రామస్తులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.