చంద్రబాబుతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ పట్ల ఆసక్తి
Prashant Kishor: ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్ టీం
చంద్రబాబుతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ పట్ల ఆసక్తి
Prashant Kishor: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ పట్ల ఇప్పడు సర్వత్రా చర్చ నెలకొంది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకై కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. చంద్రబాబు, జనసేనతో పొత్తుతో వెళ్లటంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తుపై చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం.
ఏపీలో టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉంది..? ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై పీకే చంద్రబాబుకు సూచనలు ఇచ్చారు. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా కార్యాచరణ ఉండాలని పీకే సూచించిట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో న్యూట్రల్స్ పాటు కొంత మేర వైసీపీ వర్గాల్లోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యే వరకూ టీడీపీకి పీకే సూచనలు, సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.