Prashant Kishor Team in AP: ఏపీలో మళ్లీ పీకే టీం ప్రకంపనలు?

Update: 2020-07-03 11:11 GMT

Prashant Kishor Team in AP: ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మోడీ గెలుపులో నాడు తురుపు ముక్క. నితీష్‌ను విజయాబాట పట్టించిన వ్యూహకర్త. ఏపీలో జగన్‌ సునామీకి బాటలేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్. మమతకు సైతం గెలుపు సూత్రాలు వివరిస్తున్న పొలిటికల్ వెపన్. ఇప్పుడీ పీకే మళ్లీ ఏపీలో రీఎంట్రీ ఇస్తున్నారట. మరో టాస్క్‌‌ చేపట్టబోతున్నారట. ఇప్పుడు ఎన్నికలే లేవు. మరేంటి పని అనుకుంటున్నారా. 

ఆధునిక భారత రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ కిశోర్. ఇక ఆంధ‌్రప్రదేశ్‌లో జగన్‌ సునామీకి బాటలు వేసిన స్ట్రాటజిస్ట్‌గా పీకే పేరు మార్మోగిపోయింది. ఆంధ‌్రప్రదేశ్‌ ఎన్నికల్లో, జగన్‌తో కలిసి వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టారు. నవరత్నాల రూపకల్పన, ప్రచార సరళి, సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌తో వైసీపీని జనాలకు మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లగేరహో కేజ్రీవాల్్ అన్న నినాదాన్ని అందించిన పీకే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రావాలి జగన్, కావాలి జగన్, నినాదాన్ని మార్మోగేలా చేశారు. వార్‌ వన్‌ సైడ్‌ అయ్యేలా చేశారు పీకే. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రశాంత్ కిశోర్‌ పేరు ఏపీలో ధ్వనిస్తోంది. మరి ఈసారి పీకే టాస్క్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక పాలన కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు డోర్‌ డెలివరి చేేసేందుకు సీఎం జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ల సిస్టమ్. జగన్‌ మానస పుత్రిక వాలంటీర్ల వ్యవస్థ. దాదాపు ఐదు లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్. ఇదొక విప్లవాత్మకమైన వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. కరోనా టైంలోనూ వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడిందన్న ప్రశంసలొచ్చాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే, వాలంటీర్ల పనితీరుపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సీఎం జగన్‌కు సైతం నెగెటివ్‌ రిపోర్ట్‌లు అందాయట. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు సైతం వీరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఇలాగే వీరిని వదిలిస్తే, పార్టీకి, ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని ఫిర్యాదు చేశారట. వీరి కథ తేల్చేందుకే ప్రశాంత్‌ కిశోర్‌ టీం రంగంలోకి దిగుతోందట.

ప్రశాంత్‌ కిశోర్‌ టీం, వాలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షిస్తుందట. వారి తీరుపై క్షేత్రస్థాయిలో జనాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకుంటుందట. ఏ జిల్లాలో, ఏ మండంలో, ఏ ఊర్లో, ఏ వాలంటీర్ పనితీరు ఎలా వుంది ప్రజలకు పథకాలు సరిగ్గా అందిస్తున్నారా సకాలంలో పంపిణీ చేస్తున్నారా జనాలతో వీరి ప్రవర్తన ఎలా వుంది లోపాలెక్కడున్నాయి వంటి అంశాలపై ఆరా తీస్తుందట పీకే టీం. చివరికి జగన్‌‌కు రిపోర్ట్ ఇస్తారట. వీటిన్నింటిని బట్టి చూస్తే, సీఎం జగన్‌ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వాలంటీర్ల వ్యవస్థలో రాబోయే కాలంలో ప్రక్షాళన తప్పదని అర్థమవుతోంది.


Full View


Tags:    

Similar News