ఎస్వీబీసీలో పొర్న్‌సైట్‌ లింక్‌ కలకలం

Update: 2020-11-11 06:38 GMT

ఎస్వీబీసీలో పొర్న్‌సైట్‌ లింక్‌ కలకలం సృష్టిస్తోంది. శతమానంభవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి తిరిగి ఎస్వీబీసీ ఉద్యోగి పొర్న్‌సైట్‌ వీడియో పంపాడు. దీంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఛైర్మన్‌, ఈవో తీవ్రంగా స్పందించాడు. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌క్రైమ్‌ టీమ్ తనిఖీలు చేపట్టింది. పొర్న్‌సైట్‌ వీడియో పంపిన ఉద్యోగితో పాటు.. కార్యాలయంలో పొర్న్‌సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు. అటెండర్‌ ఆనంద్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్‌క్రైమ్‌ అధికారులు గుర్తించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News