Pithapuram: ఓటర్లకు అనువుగా పోలింగ్‌ కేంద్రాలు

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీగా వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలోనే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌వి నాగేశ్వరరావు తెలిపారు.

Update: 2020-02-08 07:15 GMT

పిఠాపురం: ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీగా వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలోనే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌వి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అన్ని రాజకీయ పార్టీ నాయకుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణం లో 30 వార్డు పరిథిలో ప్రస్తుతం 52 పోలింగ్‌ కేంద్రం ఉండగా వాటిని 55 కి పెంచినట్లు చెప్పారు. ఇప్పటికే వార్డు వారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసి వాటిని విడుద చేశామన్నారు. పట్టణంలో 43,339 మంది ఓటర్లు వున్నారని తెలిపారు.

దీనిపై అభ్యంతరాు రాజకీయ పార్టీ నాయకు నుంచి స్వీకరించారు. ఏడో వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్నా పోలింగ్‌ కేంద్రాన్ని కమ్యూనిటీ హాులోకి మార్పుచేయాని, ఉమర్‌ ఆలీషా పాఠశాలో కేంద్రం దూరంగా ఉన్నందున భారతి పబ్లిక్‌ స్కూల్లోకి మార్పు చేయాని, సీబీఆర్‌ పాఠశాలోని కేంద్రాన్ని అన్నపూర్ణ ధి¸యేటర్‌ వద్దనున్న కళాశాలో మార్పు చేయాని కోరారు. వీటిని పరిశీలించి మార్పు చేస్తామని కమిషనర్‌ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ జయరాం, ఆర్‌ఐ నవీన్‌, కాంగ్రెస్‌, భాజపా. వైకాపా, తెదేపా, జనసేన, సీపీఎం పార్టీకు చెందిన నాయకు పాల్గొన్నారు.


Tags:    

Similar News