SEC Nilam Sawhney: కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది
SEC Nilam Sawhney: కుప్పం ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఎస్‌ఈసీ నీలం సాహ్ని స్పందించారు.
SEC Nilam Sawhney: కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది
SEC Nilam Sawhney: కుప్పం ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఎస్‌ఈసీ నీలం సాహ్ని స్పందించారు. ఓట్ల లెక్కింపునకు వీడియో రికార్డ్ చేయించాలన్న వ్యాఖ్యలపై వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘాలోనే పోలింగ్ జరిగిందని తెలిపారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలియజేశారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారన్నారు.
ఇక పోలింగ్ సమయంలో ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్‌కు వెళ్లి పోలింగ్ తీరును పరిశీలించారన్నారు ఎస్‌ఈసీ నీలం సాహ్ని. పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు అంతా పోలింగ్‌బూత్‌ల్లో ఉన్నారని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, రీ పోలింగ్ నిర్వహించమని ఎవరు కూడా కోరలేదని స్పష్టం చేశారు.