దగ్గుబాటి నిర్ణయం తీసుకోవడం ఆలస్యం.. ఆ ఇద్దరు రెడీ..

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. పర్చూరుకు ఎవరో ఒకరిని ఇంఛార్జిగా నియమించాలని పావులు కదుపుతోంది.

Update: 2019-10-27 02:30 GMT

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. పర్చూరుకు ఎవరో ఒకరిని ఇంఛార్జిగా నియమించాలని పావులు కదుపుతోంది.ప్రస్తుతం ఇంఛార్జిగా కొనసాగుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు, పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంచార్జి పదవిని తన కుమారుడు హితేష్ చెంచురామ్ కు ఇవ్వాలని దగ్గుబాటి కోరుతున్నప్పటికీ.. సీఎం జగన్ పెట్టిన కండిషన్ కు దగ్గుబాటి నో చెప్పారు.. దాంతో ఇంఛార్జిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నెలాఖరుకు దగ్గుబాటి వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో పర్చూరు ఇంచార్జి పదవికి పోటీ గట్టిగానే ఉంది. అయితే రావి రామనాధంబాబు, గొట్టిపాటి భరత్ లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. గొట్టిపాటి భరత్ పర్చూరు నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేశారు.. ఓడిపోయినా మూడేళ్లపాటు ఆయనే ఇంఛార్జిగా కొనసాగారు.

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలో తాను పోటీ చేయలేనని చెప్పడంతో రావి రామనాధంబాబును ఇంఛార్జిగా నియమించారు జగన్.పైగా రామనాధంబాబును సూచించింది కూడా గొట్టిపాటి భరతే.. ఎన్నికల ముందు దగ్గుబాటి చేరికతో పరిస్థితి తారుమారైంది.. పర్చూరు టిక్కెట్ దగ్గుబాటికి ఇవ్వడంతో రామనాధంబాబు టీడీపీలో చేరారు. ఎన్నికల అనంతరం తిరిగి వైసీపీలో చేరారు. ప్రస్తుతం దగ్గుబాటి నిష్క్రమిస్తారన్న ప్రచారంతో ఇంచార్జి పదవిని ఆశిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీతో పనిలేకుండా నియోజకవర్గంలో ఖర్చు మొత్తం తానే భరిస్తానని అంటున్నారట.

ఇదిలావుంటే గతంలో ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న గొట్టిపాటి భరత్ కూడా సీన్ లోకి వచ్చారు. తానే ఇంఛార్జిగా ఉంటానని ముందుకొచ్చారట. కావాలంటే ఎన్నికల ముందు తనకు ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటానని అంటున్నారట. మరి వైసీపీ అధిష్టానం దగ్గుబాటి తరువాత పర్చూరు ఇంఛార్జిగా ఎవరిని నియమిస్తోందో చూడాలి.  

Tags:    

Similar News