Chintapalle: రాజకీయ నాయకులు గిరిజనుల పక్షాన పోరాటానికి రావాలి

గడిచిన రెండు నెలల నుంచి ఉదృతంగా గిరిజన ప్రాంతంలో పోరాటాలు చేస్తున్న తరుణంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత పార్లమెంట్, శాసనసభ్యులు గిరిజనుల పక్షాన.

Update: 2020-02-06 11:45 GMT

చింతపల్లి: గడిచిన రెండు నెలల నుంచి ఉదృతంగా గిరిజన ప్రాంతంలో పోరాటాలు చేస్తున్న తరుణంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత పార్లమెంట్, శాసనసభ్యులు గిరిజనుల పక్షాన.. లేక గిరిజనేతరుల పక్షాన ఉన్నారో స్పష్టం చేయాలని ఆదివాసి హక్కుల గిరిజన పరిరక్షణ సమితి జేఏసీ కో కన్వీనర్ మొట్టడం రాజబాబు, లోచలి రామకృష్ణలు అన్నారు. 1/70 పీసా చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా కోర్టులకు ఆశ్రయించడం.. అదే విధంగా విశాఖ ఏజెన్సీ అతలాకుతలం చేస్తామనడం ఇటువంటి ఆసక్తికరమైన పదజాలం వాడిన గిరిజనేతరులపై మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

విశాఖ ఏజెన్సీలో ఒక పక్క ఆందోళనలు, బంద్ లు, ధర్నాలతో అట్టేక్కుతుంటే, మరోపక్క గిరిజనేతరులతో రహస్యంగా సమావేశాలు, సభలు నిర్వహించడం దారుణమన్నారు. ఇటువంటి గిరిజన నాయకులను కట్టేడి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పదవులు ఉన్నప్పుడు ఒకలాగా పదవులు లేనప్పుడు మరో లాగా ప్రవర్తించే రాజకీయ నాయకులను సహించబోమని.. రాబోయే రోజుల్లో వారి భవిష్యత్తు గిరిజనుల చేతుల్లోనే ఉందనేది నిజామని ఆ విషయాన్ని మర్చిపోవద్దని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు పునరాలోచించుకుని గిరిజనుల పక్షాన పోరాటానికి రావాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News