కార్టన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు ఈరోజు తెల్లవారు జామున కార్టన్ సెర్చ్ నిర్వహించారు.
కొమరోలు: మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు ఈరోజు తెల్లవారు జామున కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కార్టన్ సర్చ్ లో 11 దుప్పి కొమ్ములు మూడు ఎర్రచందనం దుంగలను, 5 కత్తులు, రెండు గోడ్డలతో పాటు పత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
నాటు సారాను అరికట్టే క్రమంలో భాగంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్టన్ సర్చ్ నిర్వహించినట్లు గిద్దలూరు సీఐ సుధాకర రావు వెల్లడించారు. ఈ కార్టన్ సర్చ్ లో సీఐ సుధాకరరావుతోపాటు గిద్దలూరు ఎస్ఐ సమందర్ వలి, కొమరోలు ఎస్ఐ మల్లికార్జునరావు, రాచర్ల త్యాగరాజు, బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.