Polavaram Project: అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేస్తాం- మంత్రి అనిల్
Polavaram Project: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేస్తాం- మంత్రి అనిల్
Polavaram Project: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆర్అండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించామన్న మంత్రి వరదలు వచ్చే సమయంలో లోపల స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, గేట్లు అన్ని పూర్తి చేసి అప్పర్, లోయర్ డ్యామ్‌లను పూర్తిచేసేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నీటిని స్పిల్‌వే ద్వారా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనుమతులు తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.