పోలవరం ఎత్తు తగ్గించం.. త్వరలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండరింగ్

పోలవరం రివర్స్ టెండరింగ్‎తో 800 కోట్ల రూపాయిలు, కాలువ టెండర్లలో రూ. 58 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. నవంబర్ నెల నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

Update: 2019-09-24 06:51 GMT

పోలవరం రివర్స్ టెండరింగ్‎తో 800 కోట్ల రూపాయిలు, కాలువ టెండర్లలో రూ. 58 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. నవంబర్ నెల నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.2022లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పిన గడుపులోగా పోలవరం పనులు పూర్తి చేస్తే టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ చేశారు.

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోతే ఆ డబ్బు టీడీపీ ఖాతాలోకి వెళ్లేవని ఆరోపించారు. రూ. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ రూ. 4,359 కోట్లకు వచ్చిందని అనిల్ కుమార్ వెల్లడించారు. నవయుగ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనక పోవడంలో మతాబు ఏంటని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

Tags:    

Similar News