PM Modi: ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లిన మోదీ, చంద్రబాబు, పవన్‌

PM Modi: ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం బయలుదేరారు.

Update: 2025-10-16 06:19 GMT

PM Modi: ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లిన మోదీ, చంద్రబాబు, పవన్‌

PM Modi: ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం బయలుదేరారు.

కర్నూలు ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈ ముగ్గురు నేతలు ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం క్షేత్రానికి పయనమయ్యారు. అక్కడ ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ముఖ్యంగా సున్నిపెంట వద్ద సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News