Srikakulam: కంప్లైంట్ ఇవ్వు.. మొబైల్ పట్టు..
Srikakulam: వివిధ సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న దాదాపు 130 సెల్‌ఫోన్లను తిరిగి వారికే అప్పగించారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు.
Srikakulam: కంప్లైంట్ ఇవ్వు.. మొబైల్ పట్టు..
Srikakulam: వివిధ సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న దాదాపు 130 సెల్‌ఫోన్లను తిరిగి వారికే అప్పగించారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. చాలా మంది తమ మొబైల్ పోతే కంప్లయిట్ ఇవ్వకుండా ఉండి పోతున్నారని ఎస్పీ రాధిక తెలిపారు. కానీ శ్రీకాకుళం పోలీసు ఐటి శాఖ నూతనంగా ఓ యాప్ ద్వారా మీరు పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రాక్ చేసి బాధితులకు ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు. దీని కోసం పీఎస్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదన్నారు. దాని కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపారు. జిల్లాలో ఎక్కడ మొబైల్ దొరికినా..స్వయంగా బాధితులకు అందజేస్తామని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. మొబైల్ పోయిన వారు వెంటనే సంబంధిత వివరాలను వెంటనే ఆన్ లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.