Phone tapping in Andhra Pradesh: ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ.. ఏపీ ప్రభుత్వంపై..

Update: 2020-08-17 08:42 GMT

Phone tapping in Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ మొత్తం మూడు పేజీల లేఖను చంద్రబాబు ప్రధానికి పంపారు. ఫోన్ టాపింగ్ కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దాంతో ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజ కీయనాయకులు , న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను టాపింగ్ చేయడంతో దేశ భద్రతకే ప్రమాదమని తెలిపారు.

ఇలాంటి చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పాలనను ఆటవిక రాజ్యం వైపు తీసుకుపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార వైసీపీ ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ల ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Tags:    

Similar News