పవన్ కళ్యాణ్ ట్వీట్‌తో వెనక్కు తగ్గిన పోలీసులు

Update: 2020-01-13 03:51 GMT

కాకినాడలో జనసేన-వైసీపీ వార్ మరింత వేడుక్కుతోంది. నిన్న జనసేన, వైసీపీ మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు జనసేన నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది వ్యక్తిగత పూచీకత్తుతో తెల్లవారుజామున విడుదలైయ్యారు. అయితే కాకినాడ వన్ టౌన్‌లో 2, త్రీటౌన్‌లో 3 మొత్తం ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. జనసేన కార్యకర్తలపై 307 వంటి హత్యాయత్నం సెక్షన్ల క్రింద కేసులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వచ్చి తేల్చుకుంటానని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 307 మినహా మిగిలిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 



Tags:    

Similar News