Pawan Kalyan: నేడు విశాఖలో పవన్‌కల్యాణ్ పర్యటన

Pawan Kalyan: బోట్లు దగ్ధమైన మత్స్యకార కుటుంబాలకు పరామర్శ

Update: 2023-11-24 04:11 GMT

Pawan Kalyan: నేడు విశాఖలో పవన్‌కల్యాణ్ పర్యటన

Pawan Kalyan: నేడు విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. బోట్లు దగ్ధమైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్. బాధితులకు 50వేల రూపాయల చొప్పున.. పవన్ ఆర్థిక సాయం అందించనున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉన్నట్టుండి హార్బర్‌లోని బోట్లలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక బోటు నుంచి మరో బోటుకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున బోట్లు దగ్ధమయ్యాయి.

ఫిషింగ్ హార్బర్‌ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న యూట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. యూట్యూబర్ సెల్ ఫోన్ డేటా, హార్బర్‌లో కదలికలపై విచారణ జరుపుతున్నారు. వారం రోజులుగా హార్బర్‌లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై కూడా ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News