AP Politics: వస్తున్నా.. వారాహితో.. ఎన్నికల ప్రచార బరిలోకి జనసేనాని..
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
AP Politics: వస్తున్నా.. వారాహితో.. ఎన్నికల ప్రచార బరిలోకి జనసేనాని..
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి గెలుపే లక్ష‌్యంగా.. ప్రచార బరిలోకి దిగబోతున్నారు. వారాహి యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 2వరకు పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతుంది. ఏప్రిల్ 3న తెనాలిలో, ఏప్రిల్ 4న నెల్లిమర్లలో, ఏప్రిల్ 5న అనకాపల్లిలో, ఏప్రిల్ 6న ఎలమంచిలి, ఏప్రిల్ 7న పెందుర్తి ఏప్రిల్ 8న కాకినాడ రూరల్, ఏప్రిల్ 9న మళ్లీ పిఠాపురంలో పర్యటిస్తారు పవన్. ఏప్రిల్ 10న రాజోలు, ఏప్రిల్ 11న పి.గన్నవరం, ఏప్రిల్ 12న రాజానగరం నియోజకవర్గంలో పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.
ఒక్కో నియోజకవర్గంలో 2 సమావేశాలు, ఒక బహిరంగ సభ ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే పర్యటనలో నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి నాయకులతో పవన్ సమావేశం అవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నాయకుల మధ్య సమన్వయం, కలిసి పని చేసేలా కూటమి కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు జనసేనాని. ఈ సందర్భంగా కూటమిలోని మహిళా నేతలతో కూడా పవన్ సమావేశం కానున్నారు. వారాహి యాత్రతో కూటమిలో జోష్ నింపే ప్రయత్నం చేయబోతున్నారు.