Jawan Murali Naiks Funeral: అమరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు..హాజరుకానున్న పవన్ కల్యాణ్
Jawan Murali Naiks Funeral: అమరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు..హాజరుకానున్న పవన్ కల్యాణ్
Jawan Murali Naiks Funeral: శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన భారత ఆర్మీ జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నేడు సాయంత్రం జరగనున్నాయి. జమ్ముకశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మే 8వ తేదీ రాత్రి పాకిస్తాన్ సైన్యం చేపట్టిన భారీ కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన దాడుల్లో పాకిస్తాన్ సైన్యం భారీ ఆర్టిలరీ మోర్టార్ దాడులకు పాల్పడింది. దీంతో తీవ్రంగా గాయపిన మురళిని న్యూఢిల్లీకి తరలించే ప్రయత్నం చేయగా.. విఫలమై ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మురళి నాయక్ మృతదేహం శనివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన పార్థివ దేహాన్ని అధికారికంగా స్వీకరించారు. తర్వాత మృతదేహాన్ని రోడ్డు మార్గం ద్వారా శ్రీ సత్యసాయి జిల్లాలోని కల్లితండా గ్రామానికి తీసుకెళ్లారు. గుమ్మయ్యగారి పల్లి నుంచి కల్లితండా వరకు జరిగిన ఊరేగింపులో వేలాది మంది గ్రామస్తులు, మురళి సహచరులు, స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు. మురళికి కన్నీటి వీడ్కోలు పలికారు.
కాగా నేడు సాయంత్రం అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మానవ వనరుల శాఖ మంత్రి నారాలోకేష్ తదితరులు పాల్గొంటారు. మరోవైపు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. మంత్రి సవిత మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడించారు. ఘటనసై సీఎం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 5లక్షల చెక్కును మురళి కుటుంబానికి అప్పగించారు.
మురళి నాయక్, శ్రీరాం నాయక్, జ్యోతిబాయ్ దంపతుల ఏకైక సంతానం. ఆయన 2022లో అగ్నివీర్ గా భారత సైన్యంల చేరాు. నాసిక్ లో ట్రైనింగ్ పూర్తి చేశాడు. 851లైట్ రెజిమెంట్లో జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. గ్రామంలోని వ్యయసాయ కార్మిక కుటుంబానికి చెందినవాడు.