Pawan Kalyan: జనసైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అప్రమత్తంగా ఉండండి..
Pawan Kalyan: జనసేన కార్యకర్తలు, నేతలు మాట్లాడే మాటల్లో.. చేసే ఆరోపణల్లో జాగ్రత్త వహించాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్.
Pawan Kalyan: జనసైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అప్రమత్తంగా ఉండండి..
Pawan Kalyan: జనసేన కార్యకర్తలు, నేతలు మాట్లాడే మాటల్లో.. చేసే ఆరోపణల్లో జాగ్రత్త వహించాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్. తీవ్రమైన విమర్శలు చేసేముందు.. ఆర్థిక నేరాల గురించి మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలన్నారు. అలాంటి విషయాలను ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు పవన్‌కళ్యాణ్.
ఆధారాలు లేకుండా నేరారోపణలు చేస్తే.. అది పార్టీకి గానీ.. సమాజానికి గానీ మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మీడియాలో వార్త వచ్చిందనో.. ఎవరో ఏదో కామెంట్ చేశారనో.. నిర్ధారణ కాని విషయాలపై మాట్లాడొద్దని తెలిపారు. పొత్తుల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా మాట్లాడొద్దన్న ఆయన.. పొత్తుల విషయంలో పార్టీకి మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటానని చెప్పారు.