Pawan Kalyan: సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారవు
Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Pawan Kalyan: సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారవు
Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న పవన్.. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవని స్పష్టం చేశారు. పాలసీల్లో తప్పులుంటే సరిచేయాలన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతి ఎక్కడకీ వెళ్లదని అన్నారు పవన్.
వైసీపీ వ్యతిరేక శక్తులన్ని కలిసి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ వచ్చాక వైసీపీని గద్దె దింపే దిశగా అడుగులు వేస్తామన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పొత్తుల కోసం ఆలోచిస్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఆలోచన లేదన్నారు.