Paritala Sunitha: అంగన్వాడీ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడదా?
Paritala Sunitha: అంగన్వాడీ మహిళలకు టీడీపీ హయాంలోనే మంచి జరిగింది
Paritala Sunitha: అంగన్వాడీ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడదా?
Paritala Sunitha: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లు నిరవధికంగా నిర్వహిస్తున్న నిరసనలకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ సిబ్బందితో కలిసి రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గతవారం రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడదా అంటూ ప్రశ్నించారు.
అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉంటే అధికారులతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు ఎలా తెరిపిస్తారనీ మండిపడ్డారు. చిత్తశుద్ధి లేని వైసిపి ప్రభుత్వంలో అంగన్వాడీ మహిళలకు అన్యాయం జరుగుతోందనీ, టిడిపి హయాంలోనే మంచి జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడటంతో పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ... తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.