Coronavirus: ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు ముందు జాగ్రత్తలో భాగమే
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కరోనా వైరస్ పై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు కొందరు విమర్శిస్తున్నారు. వైరస్ సోకితే పారాసిటమాల్ ట్యాబ్లేట్ వేసుకోవాలని అలాగే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇరువురు ముఖ్యమంత్రులు. అయితే ఈ సూచనలను కొందరు వెటకారంగా భావిస్తున్నారు. పారాసిటమాల్ వేసుకుంటే వైరస్ తగ్గుతుందా అని కొందరు.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే వైరస్ చస్తుందా అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. వాస్తవానికి ఈ రెండు మంచి పద్ధతులే అంటున్నారు వైద్యనిపుణులు.. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. అలాగే తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి.
ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉండి వైరస్ పాజిటివ్ అని తేలిన వారికి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తుంటారు.. ఈ క్రమంలో లక్షణాలను భట్టి కరోనావైరస్ చికిత్స కోసం UK NHS వెబ్‌పేజీ ఇలా పేర్కొంది: "ప్రస్తుతం కరోనావైరస్ నివారణకు నిర్దిష్టమైన చికిత్స లేదు. "యాంటీబయాటిక్స్ పని చేయవు, ఎందుకంటే అవి వైరస్లకు వ్యతిరేకంగా పనిచేయవు. "మీ శరీరం అనారోగ్యంతో పోరాడుతున్నప్పుడు లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి పారాసెటమాల్ సహాయపడుతుందని NHS సలహా ఇచ్చింది. అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) కూడా వైరస్ లక్షణాలను తగ్గించడం కోసం పారాసిటమాల్ బెటర్ అని గుర్తించింది. అయితే వైద్యుడిని సంప్రదించకుండా ఇబుప్రోఫెన్ అనే ప్రసిద్ధ ఔషధాన్ని మాత్రం తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం తెలిపింది.
జెనీవాలో WHO ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.." వైరస్ లక్షణాలను తట్టుకునేందుకు పారాసిటమాల్ ను మాత్రమే సిఫార్సు చేస్తున్నాము, ఇబుప్రోఫెన్ ను కాదు" అని లిండ్‌మీర్ స్పష్టం చేశారు. అలాగే చాలా మంది విద్య నిపుణులు పారాసిటమాల్ నే సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన పారాసిటమాల్ ను తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడం వలన ఇతర వైరస్ లను చంపే ప్రయత్నాలు చేయవచ్చని.. అయితే ఈ covid-19 బ్లీచింగ్ పౌడర్ తో చావదని.. అయినా బ్లీచ్ ను ఉపయోగించడంలో మంచే తప్ప చెడు జరగదని సూచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ లు చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు.