ఆహార లోపాన్ని అధిగమించండి

గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ పేర్కొన్నారు.

Update: 2019-11-28 05:55 GMT
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ

పాడేరు: గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సీడీపీవో లు, అంగన్వాడీ పర్యవేక్షణకు పోషణ అభియాన్ లో భాగంగా ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీవో బాలాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అంగన్వాడీకి వచ్చే చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాల్య దశలో పోషకాహార లోపాన్ని నివారించకపోతే మనిషి ఎదుగుదలను హరిస్తుందన్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు వైయస్సార్ సంపూర్ణ పోషణ సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రోజుకోసారి అంగన్వాడీల పని తీరుపై సమీక్షీస్తానని అన్నారు. 



Tags:    

Similar News