మరదలిపై కన్నేసిన బావ.. లైంగికంగా వేధించి..

Update: 2019-08-29 04:18 GMT

ఓ యువతికి అక్కమొగుడే కాలయముడయ్యాడు. మరదలిపై కన్నేసిన బావ.... ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో... లైంగికంగా వేధించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే.. తల్లిదండ్రులతో పాటు అక్కను కూడా అంతమొందిస్తానని బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి పరువుపోతుందేమోనని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఒంగోలులో జరిగింది. ఒంగోలుకు చెందిన సుధాకర్‌... మాధవిని నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... మరదలు మౌనికను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఒప్పుకోకపోతే ఇంట్లో అందరిని చంపేస్తాని బెదిరించాడు దాంతో మనస్థాపం చెందిన మౌనిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఒంగోలులో కలకలం రేపింది.

Tags:    

Similar News