Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు
Earthquake In Ongole: ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణం బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపంతో ఉలిక్కిపడింది.
Earthquake In Ongole: ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణం బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపంతో ఉలిక్కిపడింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనల కారణంగా నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పట్టణంలోని భాగ్యనగర్, శర్మా కాలేజీ, దేవుడి చెరువు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా నమోదైనట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా, ఉదయం 7:45 గంటల ప్రాంతంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస ప్రకంపనల కారణంగా ఒంగోలు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.