TTD: టీటీడీకి భారీ విరాళం

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరో భారీ విరాళం అందింది.

Update: 2025-11-26 07:07 GMT

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరో భారీ విరాళం అందింది. ప్రవాస భారతీయులు (NRI) అయిన రామలింగరాజు మంతెన తిరుమలలోని పీఏసీ (పబ్లిక్ అకోమడేషన్ కాంప్లెక్స్) 1, 2, 3 భవనాల ఆధునికీకరణ కోసం రూ. 9 కోట్లు విరాళంగా అందజేశారు.

రామలింగరాజు మంతెన ఈ విరాళాన్ని తన కుమార్తె నేత్ర మరియు అల్లుడు ఎన్నారై వంశీ గాదిరాజు పేరిట సమర్పించారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈ గొప్ప విరాళం ఇచ్చారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విరాళం అందజేసిన దాతను అభినందించారు. భవిష్యత్తులో కూడా రామలింగరాజు మంతెన మరిన్ని గొప్ప విరాళాలను అందించి టీటీడీ సేవలకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు మరియు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రామలింగరాజు మంతెన 2012 సంవత్సరంలో కూడా తిరుమలకు రూ. 16 కోట్ల భారీ విరాళాన్ని సమర్పించడం గమనార్హం. కాగా, ఇటీవల రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర మరియు వంశీ గాదిరాజు వివాహ మహోత్సవం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News