నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు : జేసీ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-19 12:29 GMT

వైసీపీ సర్కార్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా ఎస్పీని కలసిన జేసీ మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో ఇంతగొప్ప ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, బహుశా ట్రంప్ కూడా ఈ ప్రభుత్వాన్ని చూసి ఎంతోకొంత నేర్చుకొని ఉంటాడని ఎద్దేవా చేశారు. ఏపీ స్థానిక ఎన్నికల అంశంపై స్పందించిన జేసీ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయమన్నారు. జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుని ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. పంతం, పట్టింపుతో ఈ ప్రభుత్వం పోతోందని, ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ను నియమించుకున్నాక ఇష్టానుసారం ఎన్నికలు జరుపుతారన్నారు. గతంలో ఏకగ్రీవమైన వాటన్నింటిని కరెక్ట్ అంటూ కనగరాజుతో ఆదేశాలు వచ్చేలా చేస్తారన్నారు. ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేస్తే పోలీసు బలంతో బెదరింపులకు గురిచేసి విత్ డ్రా చేయిస్తారన్నారు.

Tags:    

Similar News