Kiren Rijiju: కర్నూల్‌కు ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనలు అందలేదు
Kiren Rijiju: దేశంలో ప్రతి జిల్లాకు ఒక ఫ్యామిలీ కోర్టును ఏర్పాటు చేసేలా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు.
Kiren Rijiju: కర్నూల్‌కు ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనలు అందలేదు
Kiren Rijiju: దేశంలో ప్రతి జిల్లాకు ఒక ఫ్యామిలీ కోర్టును ఏర్పాటు చేసేలా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రతి జిల్లాకో ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు చేయకపోతే పెండింగ్ కేసులు పెరిగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించే అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రస్తావించారు.
అయితే అటువంటి ప్రతిపాదనలు అందలేదని కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టు ఎక్కడ ఉన్నా దాని నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి తెలిపారు. హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టునే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు. హైకోర్టు తరలింపుపై హైకోర్టుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు.