నెల్లూరు మేయర్‌ స్రవంతికి షాక్.. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కార్పొరేటర్లు

Nellore Mayor: నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌ స్రవంతికి వ్యతిరేకంగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.

Update: 2025-11-24 06:41 GMT

నెల్లూరు మేయర్‌ స్రవంతికి షాక్.. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కార్పొరేటర్లు

Nellore Mayor: నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌ స్రవంతికి వ్యతిరేకంగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. నగర పాలక సంస్థలో మొత్తం 54 డివిజన్లు ఉండగా, 40 మంది కార్పొరేటర్లు ఏకమై ఈ నోటీసును జేసీ వెంకటేశ్వర్లుకు సోమవారం అందజేశారు.

కార్పొరేటర్ల ప్రధాన ఆరోపణలు:

మేయర్‌ దంపతులు నగర అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. వారి అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, మేయర్‌ దంపతుల చేతివాటంతో ఫైళ్లు కదలడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు.

నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 54 డివిజన్లను వైకాపా గెలుచుకున్నప్పటికీ, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో ఎదురుదెబ్బ తగలడంతో మేయర్‌ తటస్థంగా ఉంటున్నారని, నగర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

Tags:    

Similar News