National Green Tribunal: సీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం

National Green Tribunal: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2021-08-16 09:58 GMT

National Green Tribunal: సీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం

National Green Tribunal: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోటోలు చూస్తుంటే పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లే ఉందని అనుమానం వ్యక్తం చేసింది. సీమ ఎత్తిపోతల పథకం వాస్తవ పరిస్థితిపై ఈనెల 27 కల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ ఎంబీకి ఆదేశాలు జారీ చేసిది. సీమ ఎత్తిపోతల పనుల ఫొటోలను తెలంగాణ న్యాయవాదులు ఎన్జీటికి సమర్పించారు. 

వాటిని పరిశీలించిన ఎన్జీటి అక్కడ పర్యావరణ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కరణ జరిగినట్లు అర్ధమవుతోందని కామెంట్ చేసిది. కేఆర్ ఎంబీ నివేదిక పరిశీలించాక తదుపరి ఉత్తర్వులు ఇస్తామంది. అయితే జులై 7వ తేదీనే ఎత్తిపోతల పనులను ఆపేశామని ఎపీ ప్రభుత్వం ఎన్జీటికి తెలిపింది. అదేసమయంలో కేఆర్ ఎంబీ నివేదికపై అభ్యంతరాలుంటే తెలపాలని అటు ఏపీ న్యాయవాదులకు కూడా చెన్నై ఎన్జీటి ధర్మాసనం సూచించింది.

Tags:    

Similar News