ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వ్యవహారంలో ట్విస్ట్.. చంద్రశేఖర్‌రెడ్డి రాసిన లెటర్లు బయటపెట్టిన లక్ష్మీదేవి..

Mekapati Family Issue: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వ్యవహారం మరింత జఠిలమవుతోంది.

Update: 2023-01-09 14:45 GMT

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వ్యవహారంలో ట్విస్ట్.. చంద్రశేఖర్‌రెడ్డి రాసిన లెటర్లు బయటపెట్టిన లక్ష్మీదేవి..

Mekapati Family Issue: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వ్యవహారం మరింత జఠిలమవుతోంది. చంద్రశేఖర్‌రెడ్డికి తాను కుమారుడినంటూ కంప సముద్రం గ్రామానికి చెందిన మేకపాటి శివచరణ్‌రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ లేఖను పోస్ట్‌ చేయడంతో కలకలం రేగింది. చంద్రశేఖర్‌రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. దీనిపై చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చారు.

తాజాగా దీనిపై శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి స్పందించారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను ఆమె తప్పు బట్టారు. చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఉన్నప్పటి ఫొటోలోను ఆమె విడుదల చేశారు. శివచరణ్‌రెడ్డి పాఠశాల ప్రవేశం, బర్త్‌ సర్టిఫికెట్లను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ సర్టిఫికెట్లలో చంద్రశేఖర్‌రెడ్డి తన కుమారుడికి తండ్రిగా ఉన్నారంటూ ఆమె వివరించారు. తనతో సహజీవనం చేస్తున్న సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి రాసిన లెటర్లను ఆమె బయటపెట్టారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న శాంతమ్మ పరిచయమైన తర్వాత తమను దూరం పెట్టారని లక్ష్మీదేవి తెలిపారు.

పెళ్లి చేసుకుంటానని రెండేళ్లు వెంటపడి నమ్మించి లోబర్చుకున్నాడని లక్ష్మీదేవి తెలిపారు. చిన్న వయసులోనే కొండారెడ్డితో పెళ్లయిందని ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆయన వెళ్లిపోయారంది. ఈ విషయం తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని తమ బంధువులతో కూడా మాట్లాడాడని లక్ష్మీదేవి తెలిపారు. రాజకీయ వారసత్వం కోసం ఇప్పుడు తాము బయటకు రాలేదన్నారు. అబద్ధాలు చెప్పడం వల్లే ఈరోజు అన్ని విషయాలు బయటపెట్టినట్లు ఆమె వీడియోలో పేర్కొన్నారు. 

Tags:    

Similar News