Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న ఇసుక టిప్పర్.. ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక టిప్పర్ లారీ కారును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక టిప్పర్ లారీ కారును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన సంగం మండలం, పెరమన గ్రామం వద్ద చోటుచేసుకుంది.
అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఛిద్రమై, వారి తలలు వేర్వేరుగా పడిపోయాయి. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.