Penna River: పెన్నానదిలో చిక్కుకున్న 17మంది సేఫ్
Penna River: పెన్నా నది వరదలో చిక్కుకున్న 17 మందిని NDRF బృందాలు, గజఈతగాళ్లు సురక్షితంగా రక్షించారు.
Penna River: పెన్నా నది వరదలో చిక్కుకున్న 17 మందిని NDRF బృందాలు, గజఈతగాళ్లు సురక్షితంగా రక్షించారు. సోమశిల అధికారులను అప్రమత్తం చేసిన నెల్లూరు అధికారులు.. బ్యారేజీ గేట్లను దించి ప్రవాహాన్ని నియంత్రించారు. దీంతో గజ ఈతగాళ్లు, NDRF బృందాలు 17 మందిని రక్షించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ ఆనంద్.. ఆర్డీవో అనూష నది ఒడ్డునే ఉండి నిరంతరం పర్యవేక్షించారు. కాగా.. భగత్ సింగ్ కాలనీ సమీపంలోని నదిలోకి దిగిన 17 మంది పేకాట ఆడేందుకు నదిలోపలికి వెళ్లినట్టు తెలుస్తుంది.
రెండు రోజుల క్రితం సోమశిల నుంచి పెన్నా నదికి అధికారులు నీటిని విడుదల చేశారు అధికారులు. నదిలో అన్ని వైపులా నీరు రావడంతో నది మధ్యలో చిక్కుకుపోయారు. బ్రిడ్జ్ మీద నుంచి నదిలోకి నిచ్చెనలు వేసి రెస్య్కూ చేసి 17 మంది రక్షించారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.