Nara Lokesh: నేడు కడపలో నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: ఎల్లుండి నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం
Nara Lokesh: నేడు కడపలో నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కడపలో పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో యాత్రకు ముందు లోకేష్ సర్వమత ప్రార్థనలు చేపట్టనున్నారు. కాసేపట్లో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కడప చేరుకోనున్నారు. సాయంత్రం కడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే అమీన్ పీర్ దర్గా, రోమన్ కేథలిక్ చర్చిలో లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని కుప్పంకు బయల్దేరనున్నారు. ఎల్లుండి నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు.