Inner Ring Road Scam Case: ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చిన సీఐడీ

Inner Ring Road Scam Case: ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చిన సీఐడీ

Update: 2023-09-26 07:38 GMT

Inner Ring Road Scam Case: ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చిన సీఐడీ

Inner Ring Road Scam Case: ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ నారా లోకేష్‌ పేరును చేర్చింది. లోకేష్‌ను ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News