Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో లోకేష్ భేటీ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో కీలక సమావేశం నిర్వహించారు.

Update: 2025-10-22 09:29 GMT

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో కీలక సమావేశం నిర్వహించారు. పబ్లిక్‌ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టే దిశగా భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని గ్రిఫిత్‌ యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్నీ వాట్సన్‌ను కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌ పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాల పరంగా రెండు సంస్థల మధ్య సహకారం బలోపేతం చేయాలని సూచించారు. అలాగే, గ్రిఫిత్‌ యూనివర్సిటీ ఇండియా హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యా, పరిశోధనా రంగాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లకు మద్దతు అందించే రతన్ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో కలిసి గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయం పని చేస్తే రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్‌ అన్నారు.

Tags:    

Similar News