ఆరోగ్యం ఎలా ఉంది? నాగంను ప్రశ్నించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబుతో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.
ఆరోగ్యం ఎలా ఉంది? నాగంను ప్రశ్నించిన చంద్రబాబు
Nagam Janardhan Reddy Meets AP CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబుతో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత సచివాలయంలో చంద్రబాబుతో నాగం జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు నాగం జనార్ధన్ రెడ్డిని పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారని ఆయన ఆరా తీశారు. కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలపై చేసిన పోరాటాల గురించి వీరిద్దరూ గుర్తు చేసుకున్నారు.