Nadendla Manohar: వైసీపీ నాటకాలు.. పవన్ కల్యాణ్ పర్యటన నుంచి..

Nadendla Manohar: విశాఖ ఘటనపై వైసీపీ మంత్రుల ఆరోపణలను జనసేన నేతలు ఖండించారు.

Update: 2022-10-15 15:11 GMT

Nadendla Manohar: వైసీపీ నాటకాలు.. పవన్ కల్యాణ్ పర్యటన నుంచి..

Nadendla Manohar: విశాఖ ఘటనపై వైసీపీ మంత్రుల ఆరోపణలను జనసేన నేతలు ఖండించారు. విమానాశ్రయంలో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నాటకాలని ఆరోపించారు.

మరోవైపు జనసేన కార్యకర్తల ముసుగులో వైసీపీ గుండాలే రాజకీయ లబ్ధి కోసం ఈ చర్యకు తెగబడ్డారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలోనే మంత్రులు రావడమేంటని, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని అన్నారు. ఇక విశాఖ గర్జనపై నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైజాగ్ ని మీరు రాజధాని చెయ్యటమేంటని ప్రశ్నించారు. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News