జగన్‌తో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ

* మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయేనా?

Update: 2023-02-09 09:13 GMT

జగన్‌తో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ

Mylavaram: NTR జిల్లా మైలవరం YCPలో పంచాయితీ మరోసారి CM జగన్‌ దగ్గరకు వెళ్లబోతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మైలవరం MLA వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అధినేత జగన్‌ను కలవనున్నారు. ఇటీవల మైలవరం నియోజకవర్గంలో MLA KPకి, మంత్రి జోగి రమేష్‌కి మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయి YCP నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గతంలోనే ఈ అంశాన్ని CM దృష్టికి తీసుకెళ్లారు వసంత కృష్ణప్రసాద్‌. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ వివాదానికి ఆజ్యం పోసేలా రెండు రోజుల కిందట రీజనల్‌ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ దగ్గర ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంపై బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం CM జగన్‌ మంత్రి జోగి రమేశ్‌ను కారు ఎక్కించుకుని వెళ్లి ఆయనతో మాట్లాడినట్టు సమాచారం. మైలవరంలో జరుగుతున్న వివాదాలపై CM చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై ఇవాళ సాయంత్రం జగన్‌తో వసంత కృష్ణ ప్రసాద్‌ సమావేశం కానున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా YCP నాయకులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు MLA కృష్ణ ప్రసాద్‌. ఈ మధ్య గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్‌కి మద్దతుగా కామెంట్స్ చేశారు. అంతేకాదు 10 , 15 మంది చీడ, పీడల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్‌తో సమావేశం కారణంగా తాను నిర్వహించానుకున్న మీడియా సమావేశాన్ని వసంత కృష్ణ ప్రసాద్ రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News