ఏపీలో ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్: ధర్మాన ప్రసాదరావు

Update: 2020-01-07 06:52 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి... మంత్రి తనకు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Full View


Tags:    

Similar News