ధర్మకర్తనా..అధర్మకర్తనా.. అశోక్ గజపతిరాజ్ పై విజయసాయిరెడ్డి ఫైర్
Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి అశోక గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేశారు.
ధర్మకర్తనా..అధర్మకర్తనా.. అశోక్ గజపతిరాజ్ పై విజయసాయిరెడ్డి ఫైర్
Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి అశోక గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. అశోక గజపతి రాజు ధర్మకర్త.. అధర్మకర్త అంటూ ఎద్దెవా చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవకతవకలపై అశోక గజపతిరాజు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సుమారు 846 ఎకరాల దేవస్థానం భూమి గత ప్రభుత్వం హయాంలోనే అన్యాక్రాంతమయ్యిందని ఆరోపించారు. 8 వేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్నది అశోక్ గజపతిరాజు కాదా అంటూ ప్రశ్నించారు. దేవస్థానం భూ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన ప్రతి అక్రమ వ్యవహారాన్ని బయటపెడతామన్నారు.