సుజనా చౌదరిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2019-08-28 04:53 GMT

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సుజనా రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే అంటూ విమర్శించారు. రాజ్యసభ, కేంద్రమంత్రి పదవికోసం చంద్రబాబుకు ఎంత కప్పం కట్టారో చెప్పాలన్నారు. ఆయన మాటల్లోనే.. 'మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే గదా సుజనా చౌదరి గారూ? రెండు సార్లు రాజ్యసభ సభ్యుడవడానికి, కేంద్ర మంత్రి పదవి కోసం ఛంద్రబాబు గారికి ఎంత కప్పం కట్టారో బహిరంగ రహస్యమే. ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు. అలాంటి మీరు సుద్దపూసలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. బిజెపీలో చేరినా మీ హృదయం నిండా చంద్రబాబు గారే ఉన్నారు. ఆయన కోవర్టుగానే కదా మీరు పార్టీ మారింది. మీ ప్రతి చర్యనూ బిజెపి గమనిస్తుందనే అనుకుంటున్నాను. బిజెపీలో చేరి వారి విధి విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసి పోతూనే ఉంది.' అంటూ సుజనాపై విమర్శలు ఎక్కుపెట్టారు. 

Tags:    

Similar News